పండక్కి స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతి పండుగ (Sankranti Festival) వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త అందించింది. పండుగ సమయంలో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య నాలుగు ప్రత్యేక రైలు సర్వీసులను (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 10, 11, 17, 18 తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
07119 నంబరు గల ప్రత్యేక రైలు జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కు చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో 07120 నంబరు గల ప్రత్యేక రైలు జనవరి 11, 18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
సంక్రాంతి (Festival Rush) సందర్భంగా సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు కొంతమేర ఊరటనివ్వనున్నాయి. సాధారణ రైళ్లలో టికెట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు సర్వీసుల ఏర్పాటు ప్రయాణికులకు ప్రయోజనకరంగా మారనుంది.