యూత్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
చుంచుపల్లి,(విజయక్రాంతి): చుంచుపల్లి మండలం లో ఉన్నా డీసీసీ, పొంగులేటి క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Jeevitha Bima Scheme) ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి యూత్ కాంగ్రెస్(Youth Congress) నాయకుడు పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని, కష్టపడే కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, ఎడారి ప్రదీప్, పాలకుర్తి సుమిత్, జిల్లా కమిటీ నాయకులు కసనబోయిన రామ్మూర్తి, అశోక్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చింతిరాల అరుణ్, మండల అధ్యక్షులు అంతడుపుల శివ, ఆకుల వెంకట్, జల్లారపు ఈశ్వర్, మద్దెల జయసూర్య, సిద్ధి ప్రవీణ్, జితేంద్ర, నాయకులు భూక్యా శశిధర్, మాలోత్ శివ, సోమిశెట్టి సాయి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.