సిమెంట్ బల్లాల వితరణ చేపట్టిన ప్రెస్ క్లబ్
సుజాతనగర్, నవంబర్ 28/ విజయ క్రాంతి: గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సుజాతనగర్ ప్రెస్ క్లబ్(Sujatanagar Press Club) ఆధ్వర్యంలో శనివారం సిమెంట్ బల్లలు(Cement Benches) వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చల్లగుండ్ల నరేష్ కుమార్(Press Club President Challagundla Naresh Kumar) ఉబ్బనపల్లి ప్రసాదులు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు ముందుకు రావడం అన్నారు.
సమాజ సేవలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రెస్ క్లబ్ ద్వారా సిమెంట్ బల్లాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి సాయపడవై అన్న గురజాడ సూక్తిని నింపుకొని స్వచ్ఛందంగా సిమెంటు బల్లలు వితరణ అందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు కంచర్ల కామేశ్వరరావు రమాదేవి చల్లగుండ్ల నరేష్ కుమార్ విధీశా, ఉబ్బనపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు