బాధిత కుటుంబాన్ని పరామర్శ

28-11-2026 | 06:21pm

వెంకటాపూర్, నవంబర్ 28 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మండల బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి(BRS Party President Lingala Ramana Reddy) తల్లి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్(former minister Ajmeera Chandulal) కుమారుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు