ఇందిరమ్మ బీమా దరఖాస్తుల నమోదు
28-11-2026 | 06:24pm
హన్వాడ: పెద్దదర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Peddadarpalli Gram Panchayat Office) సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ ఆధ్వర్యంలో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం(Indiramma Family Insurance Scheme) దరఖాస్తుల ఆన్లైన్ నమోదు చేపట్టారు. ఈ ప్రక్రియను ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీఓ జగదీష్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.