సిలిండర్ పేలుడు..ఇల్లు బూడిద
28-11-2026 | 06:21pm
మంచిర్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలుడు కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు ఓ ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన జన్నారం మండలం కిష్టాపూర్లో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జోగు సత్తన్న ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ (Cylinder Blast) పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైనట్లు బాధితుడు సత్తన్న తెలిపారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం (Property Loss) సంభవించినప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లో ఎవరూ గాయపడకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.