ఫోటోగ్రాఫర్‌కు అసోసియేషన్ అండ
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఇర్సవడ్ల సుదర్శన్ గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో సుదర్శన్ రోజు విడిచి రోజు వరంగల్‌లోని అజరా ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న మంగపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు వడ్లకొండ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన్‌కు 8వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వడ్లకొండ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న సభ్యులను సంఘం తరఫున ఎల్లప్పుడూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో సహాయం అందించిన ప్రతి ఫోటోగ్రాఫర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.