మారుమూల ప్రాంతాల్లో నేరాలపై నిరంతరం నిఘా

28-11-2026 | 06:20pm

డీఐజీ అంబర్ కిషోర్ ఝా

మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

మహాముత్తారం,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల్లో నేరాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు డీఐజీ అంబర్ కిషోర్ ఝా(DIG Ambar Kishore Jha) అన్నారు. మహాముత్తారం పోలీస్ స్టేషన్‌(Mahamutharam Police Station)ను కాళేశ్వరం జోన్–I డీఐజీ అంబర్ కిషోర్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రత పాటించడంతో పాటు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను క్రమపద్ధతిలో ఉంచాలని సూచించారు.

స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేసుల వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో నేరాలు, శాంతిభద్రతలు, గ్రామాల పరిస్థితిపై సమీక్షించారు. మహాముత్తారం మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీఐజీ సూచించారు.

సరిహద్దుల ద్వారా జరిగే అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. రౌడీ, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట కాటారం డిఎస్పి సూర్యనారాయణ, సీఐ భీమేష్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు