ఘనంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

28-10-2026 | 01:46pm

కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల(Tekulapalli Mandal) కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Illandu MLA Koram Kanakaiah) పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి(Ponguleti Srinivasa Reddy) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.

వేడుకల్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు కోరం ఉమా–సురేందర్‌, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్‌తో పాటు నాయకులు ఈది గణేష్‌, పోశాలు, రెడ్యానాయక్‌, భద్రు, మధు, సరిత, వీరభద్రం, శివ, లక్ష్మయ్య, కృష్ణార్జునరావు, సర్దార్‌, బానోత్‌ రవి, కోరం హనుమంతు, ఈశ్వర్‌, రమేష్‌, దేవ్‌సింగ్‌, చెన్నయ్య, బొడ్డు అశోక్‌, నగేష్‌, కుమార్‌, లాలు, ఇస్లావత్‌ గణేష్‌, సాయి, శేఖర్‌, సైదులుతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు