నాలుగు ఎకరాల కంది పంట అటవీ సిబ్బంది ధ్వంసం

21-10-2026 | 02:42pm

రామన్నగూడెం గిరిజనుల ఆరోపణ

అశ్వారావుపేట అక్టోబర్ 21,(విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో కంది పంట ధ్వంసం(Pigeon pea crop) ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సర్పంచ్ మడకం నాగేశ్వరరావుకు(Madakam Nageswara Rao) చెందిన పట్టా పొలంలో సాగు చేసిన నాలుగు ఎకరాల కంది పంటను అటవీశాఖ సిబ్బంది(Forest Department personnel) ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

రామన్నగూడెం టేక్ ప్లాంటేషన్ సమీపంలోని అటవీశాఖ బేస్ క్యాంపు వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సాగు చేసిన పంట ధ్వంసం కావడంతో రైతుకు నష్టం వాటిల్లిందని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

రైతుకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరిపి, భూమి హక్కులు, పంట సాగుకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పిర్యాదు చేసేందుకు రామన్నగూడెం గిరిజనాలు మొత్తం మంగళవారం రాత్రి అశ్వారావుపేట పోలీసు స్టేషన్ కి తరలివచ్చారు.

మరిన్ని వార్తలు