పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

21-10-2026 | 03:30pm

13వ బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు

హాజీపూర్, (విజయక్రాంతి): సమాజ రక్షణ(Protection of Society), శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు(Sacrifices of Police Martyrs) వెలకట్టలేనివని, వారి సేవలు చిరస్మరణీయమని 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు(Battalion Commandant Venkateswarlu) పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలం గుడిపేటలోని(Gudipeta) 13వ బెటాలియన్ కేంద్రంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి(Police Commemoration Day) (పోలీస్ ఫ్లాగ్ డే) ముఖ్య అతిథిగా హాజరై బెటాలియన్ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ప్రశాంత జీవనం సాగించేందుకు పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ఎంతో మంది వీర జవాన్లు తమ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.

అనంతరం పోలీసు అమరుల స్మృత్యర్థం రెండు నిమిషాలు మౌనం పాటించి, గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ సింగ్, ఇతర బెటాలియన్ అధికారులు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు