భీమన్నవాడలో బతుకమ్మ సందడి
21-10-2026 | 03:08pm
కోటపల్లి, ( విజయక్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలోని భీమన్నవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు(Saddula Bathukamma Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలతో వాడలో పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆటపాటలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.
సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకల్లో పల్లె సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, ఆడపడుచులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. పూల పండుగతో భీమన్నవాడ సందడిగా మారింది .