రెడ్డిపల్లిలో ఘనంగా అమ్మవారి చీరల వేలం
భక్తిశ్రద్ధలతో వేలంపాటలో పాల్గొన్న గ్రామస్తులు..
మహబూబ్నగర్ జిల్లా, గండీడ్, అక్టోబర్ 21 విజయక్రాంతి : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Devi Sharan Navaratri Festival) భాగంగా గండీడ్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో(Reddipalli Village) మంగళవారం రాత్రి అమ్మవారి మండపాల వద్ద చీరల వేలంపాటలను వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవికి అలంకరించిన చీరలను దక్కించుకునేందుకు గ్రామస్తులు, భక్తులు(Devotees) ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో పలువురు భక్తులు అధిక ధరలకు చీరలను దక్కించుకున్నారు.
మొదటి మండపం వద్ద పోటాపోటీగా వేలం
మొదటి మండపంలోని అమ్మవారికి అలంకరించిన చీరలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వేలంపాటలో కోట్ల తిరుపతయ్య రూ.35 వేలు, బంటు బసంత్ రూ.25,100, చాపల హన్మయ్య రూ.8,100, కుర్వ బుచ్చప్ప రూ.6 వేలు, బంటు మొగులమ్మ రూ.4,500, తోకల వెంకటయ్య రూ.3 వేలు, ఎరుకల లక్ష్మి రూ.3 వేలు, కోట్ల బుగ్గమ్మ రూ.2,500, బోయిని అంజిలయ్య రూ.2 వేలు, బోయిని సత్యమ్మ రూ.2 వేలు, కొత్త అంజిలమ్మ రూ.1,500, తోకల కృష్ణ రూ.1,200, మాలే తిమ్మన్న రూ.700 చెల్లించి చీరలను దక్కించుకున్నారు.
రెండో మండపం వద్ద వేలంపాట
రెండో మండపంలోని అమ్మవారికి అలంకరించిన చీరలను డి.ప్రదీప్ కుమార్ రెడ్డి రూ.30 వేలు, గాజుల కృష్ణయ్య (రామచంద్రయ్య కుమారుడు) రూ.28 వేలు, గచ్చుమాలే రాంరెడ్డి రూ.15 వేలు, అంతంగారి రెడ్డి రూ.13 వేలు, గాజుల వెంకటయ్య రూ.12 వేలు, డి. కొండమ్మ హన్మిరెడ్డి రూ.7 వేలు, గాజుల ఎల్లప్ప రూ.7 వేలు, మున్నూరు రవి రూ.6,500, కమ్మరి రవి రూ.4 వేలు, గాజుల కృష్ణయ్య రూ.4 వేలు చెల్లించి వేలంలో చీరలను దక్కించుకున్నారు.
భక్తితో అమ్మవారి చీరల వేలం
అమ్మవారికి అలంకరించిన చీరలను వేలంలో దక్కించుకుంటే తమ ఇళ్లకు, కుటుంబాలకు శుభం కలుగుతుందని, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే భక్తులు భక్తిశ్రద్ధలతో వేలంపాటలో పాల్గొని చీరలను సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
శివతాండవంతో ఆకట్టుకున్న చిన్నారులు
ఉత్సవాల్లో భాగంగా బోయిని ఓంకార్, బోయిని మాధవ్ అనే చిన్నారులైన అన్నదమ్ములు శివుని వేషధారణలో దుర్గామాత సన్నిధిలో శివనామస్మరణ చేస్తూ శివతాండవాన్ని ప్రదర్శించారు. చిన్నారులు చేసిన శివతాండవం భక్తులను, చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
భజనలతో అమ్మవారి ఊరేగింపు
ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామ యువకులంతా ఏకరూప దుస్తులు ధరించి భజన పాటలతో వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సందడి, భజనలతో రెడ్డిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.