80 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం

21-10-2026 | 03:34pm

కల్లూరు, అక్టోబర్ 21 (విజయక్రాంతి): అయ్యప్ప దీక్షలో(Ayyappa Deeksha) ఉన్న 80 మంది స్వాములకు రావికంపాడు గ్రామానికి(Ravikampadu village) చెందిన చెన్నూరు సొసైటీ అధ్యక్షుడు పాలెపు రామారావు(Palepu Rama Rao, President of the Chennuru Society) తన సొంత ఖర్చులతో ప్రతిరోజూ అల్పాహారం, భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం, కూరగాయలు, వంట సామగ్రితో పాటు వంట మనిషి, సహాయకుల పారితోషికాన్ని సైతం ఆయనే భరిస్తున్నారు. భక్తితో పాటు సేవాభావాన్ని చాటుతున్న రామారావు ఔదార్యాన్ని గ్రామస్థులు, అయ్యప్ప స్వాములు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు