ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

26-11-2026 | 10:59am

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Markets) గురువారం స్వల్ప హెచ్చుతగ్గులతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు ఈరోజు ప్రారంభంలో స్థిరంగా కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty)లో పరిమిత మార్పులు కనిపించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ స్వల్ప లాభనష్టాల మధ్య కదలాడగా, నిఫ్టీ 25,800 పాయింట్ల స్థాయికి సమీపంలో ట్రేడైంది.

ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించగా, కొన్ని ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, అమెరికా వాణిజ్య సుంకాలపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు దేశీయ మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గత సెషన్‌లో భారీ ర్యాలీ తర్వాత మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు