పైపులైన్ ధ్వంసం.. రాత్రంతా నీటి వృథా

26-11-2026 | 10:31am

పటాన్ చెరు, నవంబర్ 26 (విజయక్రాంతి): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రేశం రోడ్డుపై తాగునీటి పైపులైన్ (Water Pipeline) ధ్వంసమై రాత్రి నుంచి నీరు వృథాగా ప్రవహిస్తోంది. పైపులైన్ దెబ్బతినడంతో పెద్దఎత్తున నీరు రోడ్డుపైకి చేరి కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు ప్రజలు తాగునీటి (Drinking Water) సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు విలువైన నీరు ఇలా రోడ్లపై వృథాగా పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి నీరు నిరంతరంగా ప్రవహిస్తున్నా సంబంధిత అధికారులు (Officials) స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెంటనే అధికారులు స్పందించి ధ్వంసమైన పైపులైన్‌కు మరమ్మతులు (Repairs) చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు