అగ్రిగోల్డ్ బాధితులు పత్రాలతో పోలీస్ కార్యాలయానికి రావాలి
26-11-2026 | 11:01am
చేగుంట, నవంబర్ 26 (విజయక్రాంతి): చేగుంట, మాసాయిపేట మండలాల పరిధిలో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు (Deposits) చేసి బాధితులైన వారు తమ వద్ద ఉన్న సరైన ధ్రువీకరణ పత్రాలతో మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించాలని చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సూచించారు.
బాధితులు ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (Documents) సమర్పించాలని తెలిపారు. డిపాజిట్‌కు సంబంధించిన ఆధారాలు, ఇతర అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు (AgriGold Victims) కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కోరారు.