ఉపాధ్యాయురాలు కృపారాణి పదవీ విరమణ సభ

26-11-2026 | 10:47am

మిడ్జిల్, నవంబర్ 25 (విజయక్రాంతి): మిడ్జిల్ మండల పరిధిలోని వస్పుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న కృపారాణి (Retirement) పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆమె జడ్చర్ల మాజీ ఎంపీపీ నిత్యానందం సతీమణి.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యారంగంలో (Education Sector) కృపారాణి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు (Students Future) కోసం ఆమె చేసిన కృషి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి ఆమె చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

అనంతరం కృపారాణిని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నంద్యాల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ బొడ్డు రాములమ్మ, రాజవర్ధన్ రెడ్డి, మిడ్జిల్ మండల విద్యాశాఖ అధికారి (MEO), వివిధ గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు