ఛలో హైదరాబాద్‌కు కాంగ్రెస్ శ్రేణులు

26-11-2026 | 10:50am

కూసుమంచి (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు, ఏఐసీసీ (AICC) పిలుపుతో టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ (Constitution Protection Rally)లో పాల్గొనేందుకు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.

రాజ్యాంగ విలువలు (Constitutional Values), ప్రజాస్వామ్య హక్కుల (Democratic Rights) పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మంకెన వాసు, ప్రధాన కార్యదర్శి ఎండీ హాఫీజుద్దీన్, మాదాసు ఉపేందర్, సీడీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ బానోతు శ్రీనివాస్, చిలకబత్తిని రామారావు, శ్యామ్ సుందర్ రెడ్డి, మారోజు భీష్మాచారి, దామోదర్, ఇందూర్తి వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, జీవన్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు