పర్యావరణ రహిత దీపావళిని జరుపుకోవాలి
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి
ముకరంపుర,(విజయక్రాంతి): హిందూ సంప్రదాయాలలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేకత ఉందని, పర్యావరణ రహిత దీపావళిని జరుపుకోవాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి(Alford Chairman Narender Reddy) స్థానిక కొత్తపల్లి నిర్వహించినటువంటి దీపావళి & మిస్ మ్యాచింగ్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడారు.
అంతకుముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి దీపాలను వెలిగించి శ్రీ మహాలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు కార్యక్రమాన్ని నిర్వహించి దీపావళి వేడుకలకు బీజం వేశారు. దీపావళి పండుగ మనకు ఐక్యత, ప్రేమా, సోదర భావం, ధర్మం, మరియు మానవతా విలువలను చాటి చెప్పుతుందని పేర్కొన్నారు. బాణాసంచా వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.మిస్ మ్యాచింగ్ కు చాలా ప్రత్యేకత ఉన్నది. మిస్ మ్యాచింగ్ అంటే వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం. ఒక కార్యక్రమానికి మరొక కార్యక్రమానికి బేధం ఉంటుంది.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు