ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఆభరణాలు స్వాధీనం

07-11-2026 | 06:42pm

వివరాలు వెల్లడించిన సీఐ కరుణాకర్ రావు

గణపురం,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally district) గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రాత్రివేళ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసు(Theft Case)లో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గణపురం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కరుణాకర్ రావు ఎస్ఐ బొరగల అశోక్ లు కేసు వివరాలను వెల్లడించారు.

వెంకటేశ్వర్లపల్లికి చెందిన అకుదారి లక్ష్మి ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆగస్టు 11న భూపాలపల్లిలోని తన కుమారుడి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే బస చేసింది. మరుసటి రోజు మధ్యాహ్నం  ఇంటికి తిరిగి రాగా, ఇంటి బయటి తలుపు తాళం తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి పరిశీలించగా గది, అల్మారా తాళాలు పగులగొట్టి ఉండడంతో పాటు అందులోని సుమారు రూ.1.06 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా నవంబర్ 07 శనివారం ఉదయం 8 గంటల సమయంలో నిందితులు ఓసీ-3, పరశురాంపల్లి ప్రాంతం నుంచి ములుగు వైపు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను ఎ2 రత్నం ప్రవీణ్  ఏ-3 టెడ్డెల రాజేష్ గా గుర్తించారు.ఎ1 నిందితుడు బెడ్డల శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. చోరీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులు వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందినవారే విచారణలో నిందితులు నేరానికి పాల్పడినట్లు వెల్లడించడంతో వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ-2 రత్నం ప్రవీణ్ వద్ద నుంచి రెండు తులాల (20 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు.

మరిన్ని వార్తలు