ప్రమాద బాధిత కుటుంబానికి వసుధ ఫౌండేషన్ ఆర్థిక చేయూత
తలమడుగు,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన పెద్దింటి గంగమ్మ, ఆమె కుమారుడు ప్రవీణ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్(BRS) నాయకులు కాటిపెల్లి వసంత్ రెడ్డి, సర్పంచ్ ఎలుగు రాజన్నలు భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో వసుధ ఫౌండేషన్(Vasudha Foundation) ఆధ్వర్యంలో గంగమ్మ కుటుంబానికి రూ.10 వేల చెక్కును శనివారం అందజేశారు. ప్రవీణ్ వైద్య ఖర్చుల కోసం త్వరలో మరింత ఆర్థిక సహాయం(Financial assistance) అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగు రాజన్న, కాటిపెల్లి శ్రీనివాసరెడ్డి, రూపేష్,చంద్రశేఖర్, అనిరుద్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.