టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుకు దీపావళి శుభాకాంక్షలు

07-11-2026 | 06:13pm

హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపిన హైకోర్టు న్యాయవాది ఇనుముల సతీష్

మంథని,(విజయక్రాంతి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC State General Secretary Duddilla Srinu Babu)ను హైకోర్టు న్యాయవాది, మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్‌లోని సింగరేణి సంస్థ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి నివాసంలో శ్రీనుబాబును కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గ అభివృద్ధి(Manthani constituency development) కోసం నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మంథని ప్రాంతానికి మరింత అభివృద్ధి, మంచి రోజులు రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, ఇనుముల సతీష్, ఇనుముల ఉమామహేశ్వరి, ఇనుముల లాస్యప్రియ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు