కలెక్టర్ రాహుల్ శర్మ దీపావళి శుభాకాంక్షలు
భూపాలపల్లి,(విజయ క్రాంతి): జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) దీపావళి పండుగ శుభాకాంక్షలు(Diwali Greetings) తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ దీపావళిని ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం, వాయు కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి పర్వదినం జిల్లా ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు.