కేంద్ర కేబినెట్ భేటీ.. బోనస్‌పై అందరి చూపు

14-10-2026 | 07:25am

ఢిల్లీలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ (Bonus) చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ చెల్లింపుపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది

మరిన్ని వార్తలు