పండుగ పూటా పస్తులే!

14-10-2026 | 05:45am
  1. బడి స్కావెంజర్లకు నాలుగు నెలలుగా అందని వేతనాలు
  2. రూ.2,000 గౌరవ వేతనానికీ దిక్కులేదు    
  3. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఎదురుచూపులు
  4. నిధుల విడుదలపై స్సష్టత కరువు
  5. పండుగల వేళ అప్పులపాలవుతున్న కార్మిక కుటుంబాలు
  6. చేతులెత్తేసిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు’

(ఎ.చంద్రశేఖర్‌రావు) :

సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఒక వైపు బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations)..మరోవైపు దసరా పండుగ సందడి.. ఇంకోవైపు సమీపి స్తున్న దీపావళి. పల్లె పండుగ కళ ఉట్టిపడుతుంటే.. ప్రభుత్వ బడులను(Government schools) నిత్యం శుభ్రం చేసే స్కావెంజర్ల ఇళ్లలో మాత్రం సంతోషమే లేదు. దసరాకు పి ల్లలకు కొత్త బట్టలు కొనివ్వలేని నిస్సహాయత.. పూట గడవడానికీ అప్పులు చేయాల్సిన దయ నీయ స్థితి. నెలకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు అందే అరకొర గౌరవ వేతనాలే(Wages) జీవనాధా రం కాగా.. అవి కూడా గత నాలుగు నెలలుగా అందక బతుకులు భారమయ్యాయి. అరకొర వేతనాలు.. ప్రభుత్వ అలసత్వం.. వారి పొట్టగొడు తున్నాయి. నెలల తరబడి వేతనాలు అందకపోవ డంతో పండగ సంబరాలకు దూరమవుతున్నామ ని, పభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు జరపకపో వడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్కావెంజ ర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొర వేతనం.. అదీ పెండింగే

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ(Toilet maintenance), బడి ఆవరణను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనుల కోసం పాఠశాల మేనేన్‌మెంట్ కమిటీలు, అమ్మ ఆదర్శ పాఠశాల(Amma Model School) కమిటీల ఆధ్వర్యంలో స్కావెంజర్లను నియమించారు. వీరికి విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు గౌరవ వేతనాన్ని నిర్ణయించారు. అరకొర జీతం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న కార్మికులకు నాలుగు నెలలుగా రూపాయి కూడా విడుదల చేయలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్కావెంజర్ల వ్యవస్థ నిధుల లేమితో కుప్పకూలింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, బడ్జెట్ కేటా యింపులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠ శాల శానిటరీ కార్మికులకు వేతనాలు నిలిచిపోయా యి. జీతాలు రావడం లేదని కార్మికులు సక్ర మంగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వ బడులు కంపుకొడుతున్నాయి. 

వేలాది మంది నిరీక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,256 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కు వగా ఉండి, మరుగుదొడ్ల నిర్వహణ అవసరమైన మొదటి విడత కింద దాదాపు 9,149 పాఠశాల లను ఎంపిక చేసి వాటిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రత్యేకంగా స్కావెంజర్లను నియ మించారు. మిగిలిన చిన్న, ప్రాథమిక పాఠశాలల్లో స్థానిక పంచాయతీ సిబ్బందితో లేదా స్వీపర్లతో పనులు చేయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులలో టాయిలెట్ల నిర్వహణ, శుభ్రత కోసం దాదాపు 25,000 నుంచి 28,000 మంది వర కు శానిటరీ కార్మికులు, స్కావెంజర్లు విధుల్లో కొనసాగుతున్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా లోనే సుమారుగా 3 వేల పైచిలుకు ప్రభుత్వ పా ఠశాలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హైస్కూళ్లు, యూపీఎస్ బళ్లలో పరిశుభ్రత నిమి త్తం దాదాపు 3,200 మందికి పైగా స్కావెంజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కమెదక్ జిల్లా పరి ధిలోనే సుమారు 900 నుంచి 1,100 మంది వరకు శానిటరీ కార్మికులు పాఠశాలల్లో పనిచేస్తున్నారు.

విద్యాశాఖ ఖాతాలు ఖాళీ 

పాఠశాలల సంరక్షణ గ్రాంట్ కింద జిల్లా కలెక్టర్ల ఆధీనంలోని జనరల్ ఫండ్స్ లేదా మినరల్ ఫండ్స్ నుంచి ఈ నిధులు ఏఏపీసీ ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యా యి. పైస్థాయి నుంచి నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో జిల్లా అధికారులు చేతులెత్తేశారు. ఎంఈఓ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగలేక కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.

జీతాలు రాకపోవడంతో విసుగు చెందిన అ నేకమంది స్కావెంజర్లు విధులకు రావడం మానే స్తున్నారు. దీనివల్ల పాఠశాలల్లో పరిశుభ్రత క్షీణిం చి, కంపుకొట్టే పరిస్థితి వస్తోంది. బడి పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కొ న్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే తలా కొంత డబ్బులు వేసుకుని ప్రైవేటు వ్యక్తుల తో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు

పండుగ పూట పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనే పరిస్థితి లేదు. దుకాణదారులు అప్పులు ఇవ్వడం లేదు. రోజువారీ నిత్యావ సరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, వచ్చే కొద్దిపాటి జీతం కూడా రాకపోతే ఎలా బతకాలి? అని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ విడు దల చేసి, పెండింగ్ వేతనాలు చెల్లించి తమను ఆదు కోవాలని స్కావెంజర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఒక్కో జిల్లాకు నెలకు బడుల సంఖ్య ప్రకారం రూ.50 లక్షల దాక బడ్జెట్ అవసరమని తెలుస్తోంది. బడ్జెట్ రాకపో వడంతో ఎంపీడీవోలు హెచ్‌ఎంల అకౌంట్ల లో జమ చేయలేదు. బడ్జెట్ వస్తేనే వారికి వేతనాలు అందుతాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి బడ్జెట్ విడుదల అ యితే వీరికి వేతనాలు మంజూరవుతాయి. ఇప్పటి వరకు నిధులు విడుదలైన దాఖలా లు లేవు. ఇప్పటికే బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. దసరా వరకైనా పెండింగ్ వేతనాలు అందిం చాలని స్కావెంజర్లు వేడుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు