రహదారి గుంతలమయం!

14-10-2026 | 05:20am

బోధన్‌లో రోడ్ల దుస్థితిపై పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు.. 

బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

రోడ్డు మరమ్మతులు ఎప్పుడు చేపడతారు? అధికారులను ప్రశ్నిస్తున్న పట్టణవాసులు

బోధన్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో(Bodhan town) రహదారుల దుస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధన్ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి(Nizamabad Main Road) పట్టణంలోని శక్కర్ నగర్ నుంచి ఆచన్పల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులకు(Motorists') తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయని పట్టణవా సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రహదారిపై గుంతలు.. ప్రయాణం ప్రాణసంకటం!

శక్కర్ నగర్ నుంచి ఆచన్పల్లి వైపు వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు సమస్యగా మారాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకుంటూ ప్రయాణించాల్సి వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రహదారి అంచు ల్లోనూ పలుచోట్ల రోడ్డు దెబ్బతిని ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ప్ర యాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగు తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్‌అండ్బీ అధికారులు ఏం చేస్తున్నారు?

పట్టణంలోని ప్రధాన రహదారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రోడ్ల నిర్వ హణ బాధ్యతలు చూసే ఆర్‌అండ్బీ అధికారులు ఏం చేస్తున్నారని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారులపై గుంతలు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించి వెంటనే మరమ్మతు లు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉం దని అంటున్నారు. రహదారుల పరిస్థితిని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా?

ప్రజల ప్రాణాలకు సంబంధించిన రహదారుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా స్పందించడం కంటే ముందుగానే రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. 

సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, శక్కర్ నగర్ నుంచి ఆచన్పల్లి వరకు రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్బీ అధికారులు స్పందిం చి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి, ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించాలని బోధన్ పట్టణవాసులు కోరుతున్నారు. అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, రహదారికి ఎప్పుడు మరమ్మతులు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు