అల్లూరి, కొమరం భీమ్‌లా తెలుగు హీరో రణబాలి

14-10-2026 | 05:30am

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి(Ranabali)‘. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువరు డైరెక్టర్లు అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అంతటా ఒక పండుగ వైబ్ ఉంది. ఈ నెల 16న తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా రణబాలి వస్తోంది.

తెలుగు సినిమా గ్లోబల్‌గా పేరు తెచ్చుకోవడంలో మైత్రీ సంస్థ పాత్ర కీలకంగా ఉంది. కథ నచ్చితే చాలు గొప్పగా స్క్రీన్ మీదకు తీసుకొస్తారు. రష్మిక నటిగా, వ్యక్తిగా తను ఎంతో ఎదిగింది. ఒక రోబోలా కష్టపడుతుంది. రష్మిక సంపాదించిన గుర్తింపు చూసి గర్వపడుతుంటా” అన్నారు. రష్మిక మాట్లాడుతూ.. “రణబాలి సెట్ లో టీమ్ అందరూ చేసే హార్డ్‌వర్క్ చూస్తే భయమేసేది. వారు ఎంత కష్టపడ్డారో చూసిన మొదటి ప్రేక్షకురాలిని నేను. ఈ సినిమా కోసం థియేటర్‌కు వెళ్తే ప్రేక్షకులు మరో ప్రపంచంలో అడుగుపెడతారు.

ఏ సినిమా చేయాలన్నా అది రాసి పెట్టి ఉండాలని నమ్ముతా. ఈ సినిమా చేస్తున్నప్పుడు అదృష్టంగా భావించా. నాకు, విజయ్ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చేశాం. అవి లవ్‌స్టోరీస్ కానీ ‘రణబాలి’లో లవ్‌స్టోరీ ఉండదు. కానీ అద్భుతమైన లవ్ ట్రాక్ ఉంటుంది. రణబాలి లవ్ స్టోరీ మూవీ కంటే చాలా పెద్దది. మేము లవ్ స్టోరీ మూవీ కూడా చేస్తాం. జయమ్మ అనే పాత్ర అందరి మనసుల్లో ఉండిపోతుంది” అని చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. “మరుగున పడిన చరిత్ర గురించి చదివినప్పుడు ఇలాంటి కథను మన ప్రజలకు చెప్పాలి, లేకుంటే దర్శకుడిగా నా ప్రయత్నం వృథా అనిపించింది.

మన పాఠ్యపుస్తకాల్లోనూ మన చరిత్రను సరిగ్గా చెప్పలేదు. అందుకే మన చరిత్రను మనమే చెప్పుకుందాం. మన చరిత్రను మనమే షేర్ చేసుకుందాం. అలా మొదలైన ప్రయాణమే రణబాలి” అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “మన తెలుగు వీరుడి గొప్పదనం చెప్పే సినిమా. ఒక అల్లూరి, ఒక కొమరం భీమ్ లా మన తెలుగు హీరో రణబాలి. ఆ సినిమాల రేంజ్‌లో మా రణబా లినీ హిట్ చేయాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “రణబాలి లాంటి సినిమాను నిర్మించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. ఇలాంటి గొప్ప కథను మా దగ్గరకు తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్‌కు థ్యాంక్స్. విజయ్, రశ్మిక వివాహం తర్వాత ఫస్ట్ చేస్తున్న సినిమా మాదే కావడం అదృష్టంగా భావిస్తున్నాం” అని చెప్పారు. ఇంకా ఈ ఈవెంట్‌లో అతిథులు, మూవీ టీమ్ కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు