ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

14-10-2026 | 05:05am

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సొంత సెగ్మెంట్లలో బాధ్యతలు  

అప్పగించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సీఎం సూచన

ఢిల్లీలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది.హైదరాబాద్-- రంగారెడ్డి- మహబూబ్‌నగర్,  నల్గొండ- -వరంగల్-- ఖమ్మం స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల(Assembly constituencies) వారీగా కోఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు మంగళవారం పీసీసీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది.

నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, జిల్లాలోని పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలని ఈ ఆదేశాల్లో సూచించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సొంత నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,  డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ సీనియర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కీలకమైన ఓట్ల నమోదును ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానానికి కోఆర్డినేటర్లు: జూబ్లీహిల్స్ - నవీన్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ - శ్రీ గణేష్, అంబర్‌పేట్ - వీ హనుమంతరావు, సికింద్రాబాద్- గడ్డం వినోద్‌కుమార్, నాంపల్లి-- తహర్‌బిన్ అహ్మద్, ఖైరతాబాద్ - దానం నాగేందర్, సనత్‌నగర్ - సయ్యద్ అజ్మతుల్లా హుస్సెని, చార్మినార్ - అమీర్ జావెద్, గోషామహాల్ - ఓబెదుల్లా కొత్వాల్ , బహదుర్‌పూరా -- అరికెల నర్సారెడ్డి, మలక్‌పేట్ - ఎంఏ ఫయీమ్, ముషీరాబాద్ - అనిల్‌కుమార్ యాదవ్, కార్వాన్ - ఎండీ రియాజ్, చాంద్రాయణగుట్ట- సయ్యద్ నిజాముద్దీన్, యాకత్‌పురా - వలిఉల్లా సమీర్, పరిగి- టీ రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ -  మల్లు రవి, ఇబ్రాహీపట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి, తాండూర్ - మనోహర్‌రెడ్డి, రాజేంద్రనగర్ - మేడిపల్లి సత్యం, శేరిలింగంపల్లి - ఆది శ్రీనివాస్, మహేశ్వరం- కే మదన్‌మోహన్‌రావు, మేడ్చల్ - అద్దంకి దయాకర్, చేవెళ్ల - కవ్వంపల్లి సత్యనారాయణ, మల్కాజ్‌గిరి - మైనంపల్లి రోహిత్ రావు, ఎల్‌బీనగర్ - బల్మూర్ వెంకట్, కుత్బుల్లాపూర్ - తోట లక్ష్మికాంతరావు, ఉప్పల్ - మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, కూకట్‌పల్లి - పటోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ - యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ - వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్ - కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, షాద్‌నగర్ -- కే శంకరయ్య, కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్చర్ల - జనంపల్లి అనిరుద్‌రెడ్డి, దేవరకద్ర - జీ మధుసుదన్‌రెడ్డి , అచ్చంపేట్ - వంశీకృష్ణ, నారాయణపేట్ - చిట్టెం పర్ణికారెడ్డి, కొడంగల్ - రేవంత్‌రెడ్డి , గద్వాల్ - బస్వరాజు సారయ్య, అలంపూర్ - డీ రాజేశ్వర్‌రావు, వనపర్తి -మేఘారెడ్డి. 

వరంగల్- ఖమ్మం- నల్లగొండ స్థానానికి కోఆర్డినేటర్లు: పరకాల - రేవూరి ప్రకాష్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి - మామిడాల యశశ్వినిరెడ్డి , వరంగల్ తూర్పు- కొండా సురేఖ, వర్దన్నపేట - కేఆర్ నాగరాజు, డోర్నకల్ - జాటోత్  రాంచంద్రానాయక్, భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ, మహబూబాబాద్ - భుక్యానాయక్, నర్సంపేట - దొంతి మాధవరెడ్డి, ములుగు - సీతక్క, స్టేషన్‌ఘన్‌పూర్ - కడియం కావ్య, జనగానం -  చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక - పాయం వెంకటేశ్వర్లు, వైరా- మాలోత్ రాందాస్, ఇల్లెందు- కోరం కనకయ్య, అశ్వరావుపేట - జారే ఆదినారాయణ, సత్తుపల్లి - రాగమయి, మధిర -  భట్టి విక్రమార్క, కొత్తగూడెం - రామసహాయం రఘురామిరెడ్డి, భద్రాచలం - కేతావత్ శంకర్‌నాయక్, నకిరేకల్ - వేముల వీరేశం, కోదాడ - పద్మావతిరెడ్డి, హుజూర్‌నగర్ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుంగతూర్తి - మందుల సామేల్, భువనగిరి - కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - నాగార్జుసాగర్ - కుందూరు జయవీర్‌రెడ్డి , ఆలేరు - బీర్ల అయిలయ్య, మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి , దేవరకొండ- బాలునాయక్, సూర్యాపేట - రామిరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి.  

మరిన్ని వార్తలు