సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం
28-11-2026 | 04:03pm
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ భవనంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైభాగంలో ఏర్పాటు చేసిన బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. డిలైట్ బిల్డింగ్ పరిసరాల్లో పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సంస్థ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. బ్యాటరీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.