ఇంటి నుంచి వెళ్లి.. బావిలో శవమై తేలి

14-11-2026 | 05:25pm

తాడ్వాయి, నవంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏనుగు బాల్ రెడ్డి (70) వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్ రెడ్డి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 10 గంటలైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

శనివారం ఉదయం గ్రామ శివారులోని నందివాడ రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఆయన మృతదేహం తేలి కనిపించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కుటుంబ సభ్యులు తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు లక్ష్మారెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు