మన్నేవారు జలాల్పూర్ లో ఘనంగా బాలల గ్రామ సభ
వెల్దుర్తి, నవంబర్ 14, విజయక్రాంతి): వెల్దుర్తి మండలంలోని(Veldurthi Mandal) జలాల్పూర్ గ్రామ పంచాయతీలో(Jalalpur Gram Panchayat) సర్పంచ్ రంగి కృష్ణ అధ్యక్షతన బాల గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు(Childrens Rights), పిల్లలకు నిర్బంధ విద్య, బాల కార్మిక నిర్మూలన(Elimination of Child Labour), బాల్య వివాహాల నివారణ, బాలల ఆరోగ్యం, రక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం అందరి బాధ్యతని సర్పంచ్ రంగి కృష్ణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పాటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు మహాత్ముల వేషధారణలు వేసి అక్కడికి వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.