ఇక ఇంటికే అయ్యప్ప ప్రసాదం

14-11-2026 | 05:12pm

శబరిమల: అయ్యప్ప స్వామి భక్తులకు ఇండియా పోస్ట్ (India Post) శుభవార్త అందించింది. ఇకపై శబరిమల ప్రసాదాన్ని నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. 2026 మండల–మకరవిళక్కు సీజన్‌ (Mandala-Makaravilakku Season)ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

శబరిమల సన్నిధానంలోని దేవస్వం అరవణ, అప్పం కౌంటర్ల వద్ద ప్రత్యేక ప్రసాద బుకింగ్ కేంద్రాన్ని (Prasadam Booking Counter) ఏర్పాటు చేశారు. నవంబర్ 17 నుంచి ఈ కౌంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ కేంద్రం ద్వారా భక్తులు ప్రసిద్ధ అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను బుక్ చేసుకోవచ్చు.

దర్శనానికి వచ్చే భక్తులు అక్కడే ప్రసాదాన్ని బుక్ చేసి, తమ ఇంటి చిరునామాకు ఇండియా పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. శబరిమలకు వెళ్లలేని భక్తులకు సైతం స్వామివారి ప్రసాదం అందుబాటులోకి రావడంతో ఈ సౌకర్యంపై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మరిన్ని వార్తలు