బాలల హక్కులు, భద్రత, విద్యపై ప్రత్యేక గ్రామసభలు

14-11-2026 | 05:23pm

మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణ .

వెంకటాపురం, నూగూరు నవంబర్ 14, విజయక్రాంతి : బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకుని  మండలంలోని 18 గ్రామపంచాయతీలలో(Gram Panchayats) సర్పంచుల అధ్యక్షతన బాలల ప్రత్యేక గ్రామసభలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగాఏదిర, గ్రామపంచాయతీలో నిర్వహించిన బాలల ప్రత్యేక గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన మండల పంచాయతీ అధికారి  బొగ్గ నారాయణ, మాట్లాడుతూ, “మన గ్రామం – ప్రతి బిడ్డకు భద్రత, విద్య, ఆరోగ్యం, గౌరవం, సమాన అవకాశాలు” కల్పించడమే ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి విద్య ఒక్కటే ప్రధాన మార్గమని, ముఖ్యంగా ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్య అందించి, వారు ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నతంగా జీవించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. బాలికల హక్కులు, రక్షణ, సమానత్వం, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

అనంతరం బాల్యవివాహాల నిర్మూలనపై బాలబాలికలు, గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని గౌరవ సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, బాలబాలికలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు