40 నెలల నిరీక్షణ.. పీఆర్సీపై ఉపాధ్యాయుల ఆగ్రహం

14-11-2026 | 05:17pm

శ్రీరంగాపూర్, నవంబర్ 14 (విజయక్రాంతి): రెండో పీఆర్సీ (Pay Revision Commission) అమలులో రాష్ట్ర ప్రభుత్వం 40 నెలలుగా కాలయాపన చేయడం తగదని టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) జిల్లా అధ్యక్షుడు రవి ప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డి. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో మండల అధ్యక్షుడు చిన్నస్వామి అధ్యక్షతన నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ మండల మహాసభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ (Contributory Pension Scheme) రద్దు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కాలపట్టిక రూపొందించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు దారితీసే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో శ్రీరంగాపూర్ మండల టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడిగా వి. చిన్నస్వామి, ప్రధాన కార్యదర్శిగా టి. శ్రావణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బుచ్చమ్మ, రమేష్, కోశాధికారిగా రాజు నాయక్, గౌరవ సలహాదారులుగా శివశంకర్, కురుమన్న ఎన్నికయ్యారు. ఎఫ్‌డబ్ల్యూఎస్ మండల కన్వీనర్‌గా బి. నరసింహ, మండల కార్యదర్శులుగా శ్రీనివాసులు, సుజాత, శ్రీనివాసులు, మాధవాచారి, సురేష్ బాబు, సమ్రీన్, నవీన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి తిమ్మప్ప, కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, చెన్న కేశవులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు