రహదారులపై ధాన్యం ఆరబోయొద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు

14-11-2026 | 05:14pm

* ప్రమాదాలకు కారణమైతే రైతులపై చర్యలు తప్పవు

* రైతులకు పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

పాపన్నపేట,నవంబర్14: రహదారులపై ధాన్యం ఆరబెట్టి(Drying grain on the roads) వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్(Papannapet SI Srinivas Goud) రైతులకు సూచించారు. రహదారులు వాహనాల రాకపోకల కోసమేనని, ధాన్యం ఆరబెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు(accidents) కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం యూసుఫ్‌పేట వద్ద రహదారిపై ధాన్యం ఆరబెడుతున్న రైతులకు(Farmers') ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు.

రహదారులపై ధాన్యం కుప్పలు పోయడం, ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారిపై ఆరబెట్టిన ధాన్యం వాహనదారులకు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు ధాన్యంపై ప్రయాణించే క్రమంలో అదుపుతప్పి కిందపడితే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

పంటను కాపాడుకునే క్రమంలో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని రైతులకు హితవు పలికారు. ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హేచ్చరించారు.

మరిన్ని వార్తలు