పార్టీలకు అతీతంగా దళితులు ఐక్యం కావాలి

14-11-2026 | 05:11pm

బోట్ల పవన్

చెన్నారావుపేట మండల అధ్యక్షుడిగా పసునూరి నవీన్ ఎన్నిక

నర్సంపేట,నవంబర్ 14(విజయక్రాంతి ) : సమాజంలో దళితులపై(Dalits') ఉన్న అసమానతలు తొలగిపోవాలంటే వారంతా రాజకీయ పార్టీలకు(political parties) అతీతంగా ఐక్యమై హక్కుల కోసం ఉద్యమించాలని 'దళిత మేధా శక్తి(Dalit Intellectual Power)' వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది బోట్ల పవన్(Advocate Botla Pavan) పిలుపునిచ్చారు.శనివారం నర్సంపేటలో జరిగిన సమావేశంలో కోనాపురం గ్రామానికి చెందిన పసునూరి నవీన్‌ను చెన్నారావుపేట మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బోట్ల పవన్ మాట్లాడుతూ. రాజ్యాంగం, చట్టాలపై దళితులకు అవగాహన కల్పించేందుకు మేధావులతో కలిసి ప్రతి పల్లెలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఆవిర్భావ సభ్యులు అడ్డ రాజు, పెంబర్తి శ్రీనివాస్, కనకం నవీన్, జన్ను సాగర్, బోట్ల దయాకర్, మాట్ల మహేష్, గంగారపు వినయ్, నత్తి చిరంజీవి, కొయ్యడ కుమారస్వామి, దుగ్గొండి, నల్లబెల్లి మండల అధ్యక్షులు కుక్కమూడి గోవర్ధన్, జన్ను కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు