బెస్తగూడెంలో పోలీసుల మెరుపు దాడులు

05-11-2026 | 10:31am

గుడుంబా తయారీపై పోలీసుల ఉక్కుపాదం

30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం

వెంకటాపురం నూగూరు, నవంబర్ 5 (విజయక్రాంతి): అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో గురువారం ఉదయం Police Department ఆధ్వర్యంలో Cord and Search Operation నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్ల Jaggery Wash‌ను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ Special Searchలో పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు CRPF బలగాలు పాల్గొన్నాయి. గ్రామంలో అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేసి అక్రమ కార్యకలాపాలపై చర్యలు చేపట్టారు. అలాగే సరైన Documents లేని 15 మోటార్ సైకిళ్లను అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులకు జరిమానాలు విధించి, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం బైక్‌లను తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టప్రకారం Strict Action తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో Illegal Activities నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు