రాంగ్ రూట్ ప్రయాణం.. నిండు ప్రాణం బలి!

11-11-2026 | 12:21pm

హైదరాబాద్: నగరంలో రాంగ్ రూట్ ప్రయాణం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని షేక్ ఆయిషా ముస్ఫిరా దుర్మరణం పాలైంది.

తండ్రి మహ్మద్ ఆరీఫ్‌తో కలిసి కళాశాలకు వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం (Wrong Side Driving) వీరి ప్రయాణానికి అడ్డుగా మారింది. ఆ బైక్‌ను తప్పించేందుకు తండ్రి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద ఆయిషా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కూతురిని కళాశాలకు తీసుకెళ్తున్న తండ్రికి తీరని విషాదం మిగిలింది. రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ఒక్కరి నిర్లక్ష్యం ఓ యువతి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. (Road Accident) ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక కుటుంబానికి జీవితకాల శోకం!

మరిన్ని వార్తలు