తరిగొప్పుల ఎస్సైగా చెన్న కేశవులు
11-11-2026 | 12:13pm
తరిగొప్పుల(విజయక్రాంతి): తరిగొప్పుల పోలీస్ స్టేషన్(Tharigoppula Police Station) నూతన ఎస్సైగా చెన్న కేశవులు(Chenn Keshavulu) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గంజాయి, అక్రమ మద్యం విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులపై నేరుగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.