కలపతో చెక్కిన మూలవిరాట్
11-11-2026 | 12:22pm
అంజన్న దివ్యరూపం దర్శనం
మల్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు)లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్టుకు గత 60 ఏళ్లుగా వేస్తున్న చందనం పూతను తొలగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు భక్తులకు స్వామివారి మూలమూర్తి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఈ సమయంలో గర్భగుడిలోని మూలవిరాట్టు దర్శనం అందుబాటులో ఉండదు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు కలపతో చెక్కిన అంజన్న దివ్యరూపాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కలపతో ఉత్సవమూర్తిని సిద్ధం చేశారు.