మౌలానా ఆజాద్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం
కోదాడలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలు
కోదాడ,(విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 138వ జయంతి వేడుకలను కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో ముస్లిం మైనార్టీ డివిజన్ అధ్యక్షుడు బాజన్(Muslim Minority Division President Bajan) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వంగవీటి రామారావు గ్రంథాలయ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మౌలానా ఆజాద్ చేసిన త్యాగాలు, విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కంపాటి శ్రీను, వార్డు కౌన్సిలర్లు షఫీ, నరసయ్య, గంధం యాదగిరి, పంది తిరుపతయ్య, ఖలీల్, హస్నా, షఫీ, బాగ్దాద్, షేక్ గోరే సాహెబ్, హాసిం భాయ్, జానీ బాబా, జహీర్ తదితరులు పాల్గొన్నారు.