గుస్సాడి, దండారి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

11-11-2026 | 12:09pm

కెరమెరి,(విజయక్రాంతి): కెరమెరి మండలంలోని సాంగ్వి, కర్పెతగూడ, నాగల్‌గొంది గ్రామాల్లో నిర్వహించిన గుస్సాడి, దండారి వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు.

అనంతరం ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ... ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గుస్సాడి కళాబృందాలకు ప్రభుత్వం రూ.15 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. గ్రామాల్లో గుస్సాడి షెడ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, ఆదివాసీ కళాకారులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు