వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ప్రశాంత్ రక్తదానం

22-11-2026 | 10:48am

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ గాంధీ భవన్‌లో వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్(Chairman of Fishermen's Congress) మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి, ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రశాంత్‌కు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.

మరిన్ని వార్తలు