యువ భారతానికి డ్రగ్స్ ముప్పు!
దుండ్ర కుమారస్వామి :
దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యా(Education) ప్రాంగణాలే మత్తు పదార్థాల ప్రభావానికి లోనవుతుండటం ఆందోళనకరం. విశ్వవిద్యాలయాలు(Universities), కళాశాలలు(Colleges), పాఠశాలల్లోకి డ్రగ్స్ సంస్కృతి(Drug culture) చొరబడుతోంది. ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా తనిఖీలు, అవగాహన కార్య క్రమాలు చేపడుతున్నా విద్యార్థి లోకంలోకి వాటి ప్రవేశాన్ని పూర్తిస్థాయి లో అడ్డుకోలేకపోవడం ఆందోళనకర పరిణామం. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
మేల్కొని, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకుండా దేశ నిర్మాణంలో భాగస్వా ములు కావాలని ఆకాంక్షించారు. అలాంటి యువతలో కొందరు నేడు తాత్కాలిక ఆ నందం కోసం మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. వారిలోని శక్తి, సామర్థ్యాలు దేశాభి వృద్ధికి ఉపయోగపడాల్సిన సమ యంలో డ్రగ్స్ ప్రభావానికి గురికావ డం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల తెలంగాణ ఈగల్ ఫోర్స్ హైదరాబాద్‌లోని ౩ వర్సిటీల్లో నిర్వహించిన పరీక్షల్లో పలువురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించిన ట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మక హెచ్‌సీయూలోనూ పదుల సంఖ్యలో విద్యార్థులు గంజాయి సేవించినటుగా తెలుస్తోంది. ఇదే వర్సిటీలో గత ఆగస్టు లో గంజాయి విక్రయిస్తూ పూర్వవిద్యార్థి అరెస్టు కావడం గమనార్హం. ఈ సమస్య వర్సిటీలకే పరిమితం కాలేదు. వైద్య, ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లోనూ ఇలాంటి పరిణామాలు ప్రశ్నలకు తావిస్తోంది. వైద్య విద్యార్థులే మత్తుబారిన పడటం వ్యక్తిగత సమస్యగా కొట్టి పారేయలేం.
పాఠశాలల పరిసరాల్లోనూ మాదకద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయ న్న వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. హైదరాబాద్‌లో వందకు పైగా పాఠశాలలు డ్రగ్స్ హాట్స్పాట్లుగా మారినట్లు గతంలో ఎక్సైజ్ శాఖ ప్రకటించిన విషయం ఈ సమస్య విస్తృతిని తెలియజేస్తోంది. విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో మత్తు పదార్థం చేరితే.. నష్టపోయేది ఒక్క కుటుంబం కాదు, యావత్ సమాజం. ఇటీవల జనగామలో గంజాయి మత్తులో ఉన్నట్లు పదిమంది యువకులు ఒక యువతిపై సా మూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి నేరాలకు కేవలం మత్తు పదార్థాలే కారణమని చెప్పలేకపోయినా, వ్యసనాల ప్రభావం నేరాలకు దారితీసే పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తుందన్న విషయాన్ని విస్మరించలేం.
మెక్సికోలో డ్రగ్స్ వ్యాపారం క్రమంగా శక్తిమంతమైన నేర ముఠాల చే తుల్లోకి వెళ్లడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ వ్యాపారంలో యువతను చేర్చుకోవడం, చిన్న వయసులోనే నేర కార్యకలాపాలకు ప్రేరేపించ డం అక్కడ తీవ్రమైన సమస్యగా మారింది.డ్రగ్స్ రవాణా చుట్టూ హత్యలు, కిడ్నాప్‌లు, గ్యాంగ్ ఘర్షణలు పెరిగి ప్రజల భద్రతే ప్రశ్నార్థకమైంది. అక్కడి పరిస్థితులు చూస్తే డ్రగ్స్ సమస్యను మొదట్లోనే అడ్డుకోకపోతే అది కేవలం యువత ఆరోగ్యానికే పరిమి తం కాకుండా దేశ సామాజిక భద్రతకూ ముప్పుగా మారుతుందని అర్థమవుతుంది. అలాంటి పరిస్థితులు మన దగ్గర తలెత్తకుండా ఇప్పుడే అప్ర మత్తం కావాల్సిన అవసరం ఉంది.
డ్రగ్స్ సమస్య కేవలం శాంతిభద్రతలదే కాదు. ప్రజారోగ్యం, విద్య, కు టుంబ వ్యవస్థ, యువత భవిష్యత్తు, దేశ మానవ వనరుల నాణ్యతకు సంబంధించిన సమగ్ర సామాజిక సమస్య. ప్రభుత్వం, పోలీసులు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, పౌర సమాజం కలిసి కట్టుగా పనిచేసినప్పుడే దీనికి సమర్థ మైన పరిష్కారం లభిస్తుంది. యువత దేశానికి సంఖ్యా బలమే కాదు.. మేధో సంప త్తి, ఉత్పాదకత, అభివృద్ధికి మూలాధారం. అలాంటి భావి తరాన్ని కాపాడటం ప్రభుత్వానిదే కాదు.. సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన చారిత్రక బాధ్యత.
వ్యాసకర్త: జాతీయ
బీసీ దళ్ అధ్యక్షుడు
9959912341