డాలర్ వద్దు.. రూపాయే ముద్దు
డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ :
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో(International trade sector) ఎదురవుతున్న తీవ్ర ప్రతికూల పరిణామాలు భారత ఆర్థికవ్యవస్థపై(Indian Economy) నెమ్మదిగా సంక్షోభం వైపు నెట్టుకు వెళ్తున్నాయి. ఒకవైపు విదేశీ మార్కెట్లో ముడి చమురు బారెల్ ధర(Price of a barrel of crude oil) వంద డాలర్ల మార్కు ను దాటి దాదాపు నియంత్రణ లేని రీతిలో ముందుకు సాగుతుండగా, మరోవైపు అమెరికన్ డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి విలువ 96 రూపాయల కనిష్ట స్థాయికి దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు సంక్షోభాలు ఒక్కసా రిగా ఒకే కాలంలో సంభవించడం ఆర్థిక వ్యవస్థను ఊహించని సవాళ్ల సుడిగుండంలోకి తోసివేసింది.
సా ధారణ వ్యవహారంలో దీనిని ‘ద్విగుణీకృత దెబ్బ‘గా పిలుస్తారు. దీనికి అదనంగా, రిజ ర్వ్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం వల్ల సామాన్యుల జీవన శైలి, వ్యాపార సంస్థల ఉత్పత్తి సామర్థ్యం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగించే దేశాలలో భారత్ ఒకటి. వా ర్షిక ముడి చమురు అవసరాలలో దాదా పు ౮౫ శాతానికి పైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. సాధారణ పరిస్థితులలో, అంటే బారెల్ చమురు ౭౫ నుండి ౮౫ డాలర్ల పరిధిలో ఉన్నప్పుడు, భారత్ ఏటా సుమారు 130 నుంచి 150 బిలియన్ డాలర్ల దాకా చమురు కోసమే చెల్లిస్తూ ఉంటుం ది.
కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితులలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర వంద డాలర్లు దా టింది. అదే సమయంలో రూపాయి విలువ పత నం కావడం వల్ల ఈ దిగుమతి వ్యయం 180 నుండి 200 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరెన్సీ విలువ తగ్గినప్పుడు విదేశీ మార్కెట్ నుంచి దిగుమతి చేసు కునే ప్రతి బారెల్‌కు మరింత ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన దేశ ఖాతా లోటును పెంచడం తో పాటు రిజర్వ్ బ్యాంక్ వద్ద గల విదేశీ కరెన్సీ నిల్వలపై భారం మోపుతుంది.
ఇతర వ్యాపారాలపై ప్రభావం..
ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయ కేంద్రాల వద్ద మా త్రమే పరిమితం కాకుండా సమస్త వ్యా పార వ్యవస్థలపై పడుతుంది. డీజిల్ ప్రియం కావడం వలన దేశవ్యాప్తంగా వస్తు రవాణా ఖర్చులు కచ్చితంగా పెరుగుతాయి. కర్మాగారాలలో వస్తువుల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ఎరువుల రవాణా, సాగు వ్యయాలు సైతం పెరుగుతాయి. ఫలితంగా పాలు, కూరగాయలు, ఆహార ధా న్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఏర్పడుతుంది.
ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ గతంలోనే రెపో రేట్లు పెంచడం ద్వారా వడ్డీ రేట్లు పెరిగాయి. దీని ప్రభావం గృహ, వాహన, వ్యక్తిగత రుణా ల ఖాతాదారులకు నెలవారీ కిస్తీలు(ఈఎంఐలు) భారీగా పెరు గుతాయి. సాధారణం గా ధరలు పెరిగినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. దానికి తోడు రుణాల వాయిదా చెల్లింపులు భారంగా మారుతాయి. తద్వారా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది. ఒకవైపు వస్తువుల ధరల సెగ, మరోవైపు బ్యాంకు కిస్తీల భారం మోయలేక సగటు పౌరుడు సతమతమవుతాడు.
మార్కెటింగ్‌లో అస్థిరత
కంటి ముందే రూపాయి మార కం విలువ పడిపోతుండటంతో విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారులు దేశీయ వాటా మార్కెట్ల నుం డి తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. ఉపసం హరించుకున్న నిధులను సురక్షితంగా భావించే అమెరికా రుణపత్రా లలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతారు. ఇది మన వాటా మార్కెట్లలో తీవ్రమైన ఒడిదొడుకులకు కారణమవుతుంది. పరిశ్రమల విషయానికి వస్తే.. బ్యాంకులు విధించే అధిక వడ్డీ రేట్ల కారణంగా కంపెనీలు నూతన రుణాలను తీసుకుని తమ కార్యకలాపాలను విస్తరించడానికి వెనుకాడతాయి.
ఒకవైపు పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, మరోవైపు తగ్గుతున్న లాభాల వల్ల వ్యాపార వర్గాలు కొత్త మూలధన పెట్టుబడులను నిలిపివేస్తాయి. ఇది ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాల సృష్టికి గొడ్డలిపెట్టుగా మారి, మొత్తం ఉపాధి కల్పన విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ తీవ్రమైన సంక్షోభ పరిణామాన్ని ఎదుర్కోవడం ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు అత్యంత సంక్లిష్టమైన అంశం. రూపాయి విలువను రక్షించడానికి, దాని పతనాన్ని అడ్డుకోవ డానికి కేంద్రీయ బ్యాంక్ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుండి డాలర్లను విపణిలోకి విడుదల చేయాల్సి ఉంటుంది.
అలాగే ప్రభుత్వం స్థానిక విపణిలో ద్రవ్యోల్బణ తీవ్రతను తగ్గించేందుకు ఇంధనంపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాలను కొంతమేర త గ్గించడంపై పునరాలోచన చేయాలి. దీనివల్ల ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ, సాధా రణ ప్రజలకు ధరల భారం నుండి కొంత ఊరట లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా పునరుత్పాదక శక్తి వనరులైన సౌరశక్తి, విద్యుత్ వాహన రంగాలను మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర దేశాలతో స్వదేశీ కరెన్సీలోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ముమ్మరం చేయడం అత్యంత అవసరం.
అధిక వడ్డీ రేట్ల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడకుండా ఉండేందుకు భాగస్వామ్య బ్యాంకులతో ప్రత్యేక ప్రాధాన్య రుణ సదుపాయాలు, వడ్డీ రాయితీలు కల్పించడం ద్వారా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు మందగించకుండా కాపాడవచ్చు. ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లు దాటడం, డాలర్‌తో రూపా యి విలువ 96 రూపాయలకు క్షీణించడం, పెరిగిన వడ్డీ రేట్లు ఈ మూడింటి తీవ్రత భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు తాత్కాలికంగా మందగించే అవకాశం ఉంది. సరైన సమగ్ర ఆర్థిక విధానాలు, సమర్థవంతమైన నిర్ణయాల ద్వారా మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ద్వంద్వ సంక్షోభం నుండి సురక్షితంగా బయటపడగలదు. లేనియెడల సామాన్యుల నిత్యజీ విత అవసరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
- అధ్యక్షులు, (టాస్క్)
తెలంగాణ అధ్యయన
సమాలోచన కేంద్రం