వర్సిటీ పోస్టులకు వెయిటేజీ విఘాతం!

30-10-2026 | 05:00am

తెలంగాణలో డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీల్లో అసిసెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం ఎంతోమంది ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ(Assistant Professor Recruitment) ప్రక్రియలో.. జీవో 21 ప్రకారంమొత్తం 100 మార్కుల్లో విద్యా రికార్డు, పరిశోధనా పనితీరుకు 50, విషయ పరి జ్ఞానం, బోధనా నైపుణ్యాలకు 30, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు.

విద్యా ప్రతిభ విభాగంలో డిగ్రీ, పీజీ మార్కు లతో పాటు జూనియర్ పరిశోధనా ఫెలోషిప్, జాతీయ అర్హత పరీక్ష, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష, పీహెచ్డీ, ఎంఫిల్, పరిశోధనా ప్రచురణలు, సెమినార్ల వంటి అంశాలకు మార్కులు కేటాయిం చారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీ పోస్టుల నియామకాల్లో కూడా జీవో 4 ప్రకారం.. 100 మార్కులకు అకా డమిక్ ప్రతిభకు 50 శాతం, రాత పరీక్షకు 40 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఈ రెండు జీవోలలో విద్యా రికార్డుకు అత్యధిక వెయిటేజీ  ఆందోళన కలిగిస్తున్నది. 

కనీస అర్హతగా నెట్ , సెట్..

డిగ్రీ , పీజీ మార్కులకు గరిష్ఠంగా 8, 12 మార్కులు కేటాయించారు. ఈ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ ఒకే సమయంలో డిగ్రీ, పీజీ చేసిన వారు కాదు. కొందరు దశాబ్దం లేదా అంతకు క్రితమే పూర్తి చేసి ఉంటారు. అప్పటి విద్యా విధానాలు, మూల్యాంకన పద్ధతులు, మార్కుల శాతం, గ్రేడింగ్ నేటి పరిస్థితులకు భిన్నంగా ఉండొచ్చు. దీంతో అప్పట్లో మంచి ప్రతిభ కనబరిచి.. తక్కువ మార్కులు సాధించిన వారికి, అధిక శాతం మార్కులొచ్చిన ఇప్పటివారితో పోటీ పడేటప్పుడు అకాడ మిక్ మార్కుల వెయిటేజ్ ప్రతికూలం కావచ్చు.

విద్యా రికార్డ్‌కు మార్కుల కేటాయింపు వల్ల గ్రామీణ, పట్టణ, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసం ఉంటుంది. సామాజికవర్గాల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యా ర్థులు మరింత నష్టపోవచ్చు. ఇక సంవత్సరాల క్రితం సాధించిన మార్కుల కంటే, ప్రస్తుత అభ్యర్థికున్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, బోధనా నైపుణ్యం, పోటీపరీక్షలో చూపే ప్రతిభను కొలవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. డిగ్రీ, పీజీ మార్కులకు ఇచ్చే వెయిటేజీని తగ్గించి, ఆ మార్కులను రాత పరీక్షకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు పీహెచ్‌డీకి అత్యధిక వెయిటేజీ ఇచ్చారు. ప్రస్తుతం పీహెచ్‌డీ ప్రక్రియలో కూడా పారదర్శకత లోపించిందని, ఆ సర్టిఫికెట్లు అంగట్లో సరుకుగా మారినట్లు వార్తా కథనాలున్నాయి. కావున అకాడమిక్ ప్రతిభ కన్నా యూజీసీ నిర్దేశించిన నెట్, సెట్ ఫలితాలను కనీస అర్హతగా తీసుకోవాలి. మరోవైపు వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూకు 20, డిగ్రీ కాలేజీ పోస్టులకు 10 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూల పారదర్శకతపై గతంలోనే అభ్యంతరాలున్నాయి. కావున ఇంటర్వ్యూ మార్కులు తగ్గించాలి. దాని ప్రమాణాలు ముందుగా ప్రకటించాలి.  

రాత పరీక్షే బెటర్..

ఈ నియామకాల కోసం జారీ చేసిన జీవో 21, జీవో 4 వల్ల తీవ్ర నష్టం జరుగుతున్నదనే ఆందోళనలున్నాయి. దీంతో వాటిని రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. గతంలో ప్రతిపాదించిన డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల్ల్లో టెక్నికల్(544) పోస్టులే అధికంగా ఉన్నాయి. సైన్స్, మ్యాథ్స్, తదితర సబ్జెక్టుల పోస్టులు లేవు. కావున అన్ని సబ్జెక్టుల ఖాళీలను గుర్తించి సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేలా చూడాలి. అకాడమిక్ పనితీరుకు ప్రాధా న్యత తగ్గించి, రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టినప్పుడే ప్రతిభకు సమాన అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. లేదంటే నిరుద్యోగులు ఆందోళనలకు దిగొచ్చు. నియామక ప్రక్రియకు అంతరాయం కలగొచ్చు.

 వ్యాసకర్త: సామాజిక 

విశ్లేషకులు, 7989579428.

సంపతి రమేష్

మరిన్ని వార్తలు