రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం!

29-09-2026 | 05:00am
  1. ఇకపై విదేశాలకూ ముల్కనూర్ బియ్యం
  2. దసరాకు రూ.3.50 కోట్లు పంపిణీ
  3. మహాసభలో బ్యాంక్ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి 

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రైతుల ఆర్థిక అభివృద్ధే(economic development of farmers) లక్ష్యం అని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు(Mulkanoor Cooperative Rural Bank) అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ 70వ వార్షిక మహాసభ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం ముల్కనూరులో సోమవారం జరిగింది.  ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముల్కనూర్ స హకార సంఘం 426 కోట్లు వ్యాపారం చేసి ఏడు కోట్ల 50 లక్షల రూపాయలు లాభం గడిచింది అన్నారు. రైతులకు 250 కోట్లు పంట రుణాలు ఇచ్చినట్టు తెలిపారు.

47 కోట్లు ఖర్చు చేసి వరి విత్తనాలు(Paddy seeds) తయారు చేసి ఉత్పత్తి అమ్మకాలు జరిపినట్లు తెలిపారు. ముల్కనూర్ వరి విత్తనాలు మహారా ష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్టు చెప్పారు. బ్యాంకు నుంచి పత్తి ఉత్పత్తులు(Cotton products) 17వేల క్వింటాలు అ మ్మకాలు జరిపి వాటి మీద వచ్చిన లాభాలు బోనస్ రూపంలో రైతులకు ఇస్తున్నట్టు తెలిపారు. బ్యాంకు పరిధిలోని 3,000 మంది రైతులకు పంట అప్పు రుణమాఫీ కింద ఒక్కో రైతుకు 1,50,000 చొప్పున 141 మంది రైతులకు ఒక కోటి రూపాయలు రుణమాఫీ పథకం వర్తింపజేసినట్లు వెల్లడించారు.

రైతుల పిల్లలు మెడిసిన్ ఉన్నత చదువులు చదివిన వారికి స్కాలర్షిప్ కింద 21 మంది విద్యార్థులకు రూ.16 లక్షలు అందించమన్నారు. కంటి పరీక్షల నిమిత్తం 3,514 మంది మంది రైతులకు రూ రెండు కోట్ల 50 లక్షలు ఖర్చు చేశామన్నారు. బ్యాంకు రైతులకు వివిధ పథకాల ద్వారా రూ 13 కోట్ల 50 లక్షల రూపాయలు నేరుగా లాభం సమకూర్చినట్లు వెల్లడించారు. యూరియా ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా 27 వేల బస్తా ల యూరియా కొనుగోలు చేసి బ్యాంకు రైతులకు 200 నుంచి సుమారు 800 రూ పాయల వరకు తక్కువకు అందిస్తున్నామన్నారు.

దీంతో రైతులకు ఒక కోటి 70 లక్షల కు పైగా లాభం సమకూర్చినట్లు తెలిపారు. పాడి రైతులకు షెడ్ల నిర్మాణానికి,   గొర్రెలు మేకలు పెంపకం కొరకు బావుల వద్ద షెడ్ల నిర్మాణంకు 10 లక్షల వరకు నాబార్డ్ ద్వారా రుణ సహాయం అందిస్తున్నామన్నారు.  ముల్కనూర్ సహకా ర రైతులు పండించిన వరి ధాన్యంపై డి మాండ్‌తో అన్ని రాష్ట్రాలకు బియ్యం పంపిణీ తో పాటు ఇతర దేశాలకు బియ్యం పంపించేందుకు అనుమతులు తీ సుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో బ్యాంకు జిఎం మా రుపాటి రామ్‌రెడ్డి, ఉపాధ్యక్షు లు గజ్జి వీరయ్య,  డైరెక్టర్లతోపాటు 7500 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు