ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

18-11-2026 | 04:31pm

హనుమకొండ, నవంబర్ 18(విజయ క్రాంతి): ఈ నెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని(World Fishermens Day) పురస్కరించుకుని హనుమకొండలోని(Hanamkonda) మచిలీ బజార్ చేపల మార్కెట్(Machili Bazaar Fish Market) వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ పోస్టర్‌ను(Poster) ముదిరాజ్ మహాసభ నాయకుడు పులి రజనీకాంత్ ఆద్వర్యం లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పులి రజనీకాంత్ ముదిరాజ్(Puli Rajinikanth Mudiraj) మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల హక్కులు, వారి కష్టాలు, వారి జీవన విధానం, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకునే గొప్ప రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవమని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం(Welfare of Fisherfolk), అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా తెలంగాణ ముదిరాజుల మహాసభ స్థాపించి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డివిజన్‌లో మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ముదిరాజ్ బంధువులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి, జెండా ఆవిష్కరణలు చేపట్టి, 12 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా సంబరాలు చేసుకోవాలని కోరారు.

గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ముదిరాజుల మహాసభ ముదిరాజుల ఐక్యత, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ముదిరాజులందరూ ఐకమత్యంతో సంఘటితమై సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మధుసూదన్, పులి సదానందం,బయ్య శోభన్, కొండా అశోక్, ఇప్పచుక్కయ్య ,సదానందం, ముత్యాల శీను, కొండ కుమార్, పులి సందీప్, చెంచుల రవి, బండి మధు, కుమార్, పులి జ్యోతి, పులి కవిత, కొండ లత, కవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు