పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
జగిత్యాల, నవంబర్ 19 ( విజయ క్రాంతి ): జగిత్యాల పట్టణం లోని 2వ వార్డులో చెత్త సేకరణ వాహనాలు(Waste collection vehicles) రావడం లేదని, పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కమిషనర్ సత్య ప్రణవ్ కి(Commissioner Satya Pranav) బిజెపి నాయకుల వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని 2వ వార్డులో గత కొంతకాలంగా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు రావటం లేదని, దీంతో వార్డు ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెత్త సేకరణ సక్రమంగా జరగక పోవడం వల్ల వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందన్నారు.
దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, స్థానిక బూత్ అధ్యక్షులు నారాయణ, పవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.